అమీర్ ఖాన్ సినిమా దంగల్‌లో చిన్ననాటి బబితా ఫోగట్‌గా నటించిన సుహానీ భట్నాగర్ తన 19వ ఏట చనిపోయారు.
డెర్మయోసైటిస్‌తో సుహానీ మరణించినట్లు ఆమె తండ్రి సుమిత్ భట్నాగర్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఫిబ్రవరి 7న సుహానీ భట్నాగర్‌ను దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు చికిత్స జరిగింది. అయితే ఆమెకున్న జబ్బు తీవ్రం కావడంతో ఫిబ్రవరి 16న ఆమె చనిపోయారు.
డెర్మయోసైటిస్ చాలా అరుదైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో కండరాలు బలహీనమవుతాయి. శరీరం మీద దద్దుర్లు ఏర్పడతాయి.
ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే జబ్బు నయం అవుతుంది.
అయితే కొన్ని కేసుల్లో ఈ వ్యాధి శరీరంలోని కీలక అవయవాలకు సోకి రోగి ప్రాణాలు పోగుట్టుకునే అవకాశం ఉంది.
Tags:
Bollywood