బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ రానా గురువారం ఒవైసీ సోదరులకు సవాల్ విసిరారు. మాకు 15 నిమిషాలు కాదు... 15 సెకన్ల సమయం ఇస్తే చాలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ఎక్కడి నుంచి వచ్చారో... ఎక్కడికి వెళతారో తెలియకుండా ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నవనీత్ కౌర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 2013లో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే 100 కోట్ల మంది హిందువుల అంతు చూస్తామని హెచ్చరించారు. నాటి ఈ వ్యాఖ్యలకు నవనీత్ కౌర్ కౌంటర్ ఇచ్చారు.
నవనీత్ కౌర్ మాట్లాడుతూ, 'సోదరా, (అక్బరుద్దీన్) 15 నిమిషాలను పోలీసులను తప్పిస్తే ఏం చేస్తామో చూస్తామని మీరు అన్నారు. కానీ సోదరా, మేం 15 సెకన్లు పోలీసులను తొలగిస్తే చాలని అంటున్నాం' అని వ్యాఖ్యానించారు.
Tags:
News