ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం పాలసీ కేసులో ఆయన అరెస్టైన ఆయనకు సుప్రీం కోర్టు నేడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ వరకు ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2న లొంగిపోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మద్యం పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు.
కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై పలువురు నేతలు స్పందించారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ రావడం సంతోషంగా ఉందని, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ట్వీట్ చేశారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. కేజ్రీవాల్ విడుదల కేవలం న్యాయానికి ప్రతీక మాత్రమే కాదు... ఇది ఇండియా కూటమికి బలం అన్నారు. ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసే దిశగా తమకు బలాన్ని ఇస్తుందన్నారు.
Tags:
News