కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళల కార్యకలాపాలపై ఆయన నిఘా వేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు సహా ఎవరు ఏం చేస్తుంటారు? ఎప్పుడు, ఎక్కడ ఉన్నారు? అనే దానిపై ఆయన దృష్టి సారిస్తుంటారన్నారు. తాను కొన్నిరోజుల క్రితం తన కూతురును చూసేందుకు థాయ్‌లాండ్ వెళ్లానని... ఈ అంశాన్ని అమిత్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారన్నారు.
'అవును... నేను థాయ్‌లాండ్ వెళ్లాను. అయితే ఈ సమాచారం ఆయనకు ఎవరు ఇచ్చారో చెప్పగలరా? ఆయన దగ్గర సమాచారం ఉన్ననప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన పనేంటి?' అని ప్రియాంక మండిపడ్డారు.
Tags:
News