పీఓకేను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)
చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్‌లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు.
రక్షణ మంత్రి ఆదేశిస్తే భారత అధికారులు ముందుకు సాగుతారు.. కానీ పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దంటూ హెచ్చరించారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో భాగమని పార్లమెంట్ తీర్మానం చేసినట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గుర్తు చేశారు. పీఓకే(PoK) గురించి ప్రజలు మరచిపోయేలా చేశారని, అయితే దాన్ని ఇప్పుడు తిరిగి తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.
Tags:
News