విపక్ష 'ఇండియా' (I.N.D.I.A.) కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ (West Bengal) లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమ మద్దతుపై స్పష్టత ఇచ్చారు. హుగ్లీ జిల్లాలోని చిన్‌సురహ్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీ 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నప్పటికీ ఈసారి అది జరగదని ప్రజలు చెబుతున్నారని అన్నారు., కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 'ఇండియా' కూటమికి బయట నుంచి తాము మద్దతిస్తామని తెలిపారు.
Tags:
News