తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆరోపించారు. తాను ఆర్ ఆర్ ట్యాక్స్ అన్నాను.. కానీ ఎవ్వరి పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ మాత్రం మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబతున్నారనిఅన్నారు. మొదట రాహూల్ ప్రేమ దుకాణం పెట్టి.. ఇప్పుడు విద్వేషం చూపుతున్నారని విమర్శించారు. నారాయణపేటలో శుక్రవారం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది, ఈ సభలో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Tags:
News